తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారనే వార్తలు హల్ చల్ చేశాయి.. కార్యాలయ సిబ్బందిని మొత్తం భారత్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా.. కార్యాలయం మూసివేశారని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అసలు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయలేదని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్పష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భారతీయులు.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్లడించింది. ఇక, భారత రాయబార కార్యాలయానికి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది భద్రత కొనసాగుతుందని వెల్లడించింది. మరోవైపు ఆఫ్గన్లకు అండగా ఉంటామని ప్రకటించింది భారత ప్రభుత్వం.. కాబూల్ నుండి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమైన తర్వాత హిందువులు, సిక్కులకు స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.