ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. కళాతపస్వి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు.
'ఎస్' ఫర్ సక్సెస్ అంటారు. విశ్వనాథ్ కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. తన దగ్గరకు ఎవరైనా కొత్త నిర్మాతలు వస్తే, వారితో సినిమాలు తీసే టప్పుడు టైటిల్ లో 'ఎస్' అనే అక్షరంతో ఆరంభమయ్యేలా చూసేవారు.
యాక్షన్ హీరోగా సాగుతున్న కృష్ణను నటునిగా తీర్చిదిద్దింది విశ్వనాథ్ అనే చెప్పాలి. అంతకు ముందు బాపు దర్శకత్వంలో కృష్ణ 'సాక్షి' వంటి సినిమాలో నటునిగా మార్కులు సంపాదించినా, కృష్ణను వైవిధ్యంగా చూపించింది విశ్వనాథే!