ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఫోకస్ పెడుతోంది భారతీయ జనతా పార్టీ.. గతంలో పోలిస్తే.. ఇప్పుడు రెగ్యులర్‌గా ఏదో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తూనే ఉంది.. ఆ పార్టీ అగ్రనేతలు.. ఈ మధ్య వరుసగా టాలీవుడ్ ప్రముఖ హీరోలను కలవడం పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇవాళ రాజమండ్రిలో పర్యటించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలు ఓబీసీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారని…
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని.. కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కే. లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభకు భారీగా జనాలు రావడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని.. మోదీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని ఆయన అన్నారు. మోదీ పద్మ అవార్డులు, రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక…
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కే. లక్ష్మణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. టీఆర్ఎస్‌లో వెన్నుపోటు పొడిచేందుకు కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, ఈ కట్టప్పల…
ఆ మధ్య తెలంగాణ బీజేపీలో కొందరు సీనియర్లు.. పాతతరం నాయకుల తీరు కలకలం రేపింది. పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న వాళ్లంతా.. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జట్టుకట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కమలాన్ని కలవర పెట్టాయి. సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దించి.. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాంతో పాత నేతలు చల్లబడినట్టు సమాచారం. అయినప్పటికీ తమకు బీజేపీలో తగిన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయంలోనే…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పాదయాత్ర ముగింపు సభను ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే.. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభకు.. బీజేపీ శ్రేణులు అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. అంతేకాకుండా… అమిత్ షా తెలంగాణ పర్యటనపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న క్రమంలో.. బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ…