K Laxman: సినిమా హీరోలతో పాటు అందర్నీ బీజేపీలోకి ఆహ్వానిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఫోకస్ పెడుతోంది భారతీయ జనతా పార్టీ.. గతంలో పోలిస్తే.. ఇప్పుడు రెగ్యులర్‌గా ఏదో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తూనే ఉంది.. ఆ పార్టీ అగ్రనేతలు.. ఈ మధ్య వరుసగా టాలీవుడ్ ప్రముఖ హీరోలను కలవడం పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇవాళ రాజమండ్రిలో పర్యటించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలు ఓబీసీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారని విమర్శించారు.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.. దివంగత నేత ఎన్టీఆర్ 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: JC Prabhakar Reddy: నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి..!
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ఇక, తెలంగాణలో 26 బీసీ కులాలను కేసీఆర్ తొలగిస్తే.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు కె. లక్ష్మణ్.. అంతేకాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులను బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారికి కేటాయించగలరా? అంటూ సవాల్ చేశారు. మరోవైపు.. రెండు రాష్ట్రాల్లో పార్టీ పిటిష్టానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న లక్ష్మణ్… సినిమా హీరోలతో పాటు చాలా మందిని బీజేపీలోకి ఆహ్వానిస్తాం అన్నారు. తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని పేర్కొన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్.
మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు.. వినాయక చవితి ఉత్సవాల ఆటంకాలపై ముఖ్యమంత్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశామని వెల్లడించిన ఆయన.. ఇదే విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.. వైసీపీ ప్రభుత్వం.. వినాయక చవతి విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలు చేస్తుందని ప్రకటించారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!