ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకిచ్చింది. ఎస్‌బీఐ పెంచిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హోం, పర్సనల్, కారు లోన్‌లపై చెల్లించే ఈఎంఐలు పెరిగాయి. ఎంసీఎల్‌ఆర్‌ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఎంసీఎల్ఆర్ ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి.…
తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. విశ్వక్ సేన్ పాత్రలో రాజ్‌కుమార్ రావు, రుహాని శర్మ పాత్రలో సన్యా మల్హోత్రా కనిపించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, కుల్‌దీప్ రాథోడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘హిట్’ మూవీ రిలీజ్ డేట్‌ను…