HIT Movie: జూలైలో రాబోతున్న బాలీవుడ్ ‘హిట్’ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. విశ్వక్ సేన్ పాత్రలో రాజ్‌కుమార్ రావు, రుహాని శర్మ పాత్రలో సన్యా మల్హోత్రా కనిపించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, కుల్‌దీప్ రాథోడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ‘హిట్’ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూలై 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తప్పిపోయిన అమ్మాయిని వెతికే పోలీస్ కథ నేపథ్యంలో హిట్ సినిమా ఉంటుంది. మర్డర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెలుగులో విశ్వక్ సేన్ మంచి నటన కనపరిచాడు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. కాగా త్వరలో తెలుగులో హిట్-2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీక్వెల్‌లో విశ్వక్ సేన్ పాత్రలో అడివి శేష్ కనిపించనున్నాడు.
Also Read
Hitting the theatres with HIT – The First Case, with a new release date 15th July 2022@RajkummarRao @sanyamalhotra07 @KolanuSailesh #BhushanKumar @TSeries @DilRajuProdctns @SVC_official #KrishanKumar @kuldeeprathor9 @tuneintomanan #ShivChanana pic.twitter.com/1RGqQOufTq
— Dil Raju Productions (@DilRajuProdctns) May 13, 2022
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!