దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా సహజీవనం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవస్థలోకి రాకుండా.. సమస్యల సుడిగుండంలో ఉండకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ సహజీవనం వైపు వెళుతున్నారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని పిటిషన్ వేశారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెల్లడించింది.
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ రోజు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మరియు తనని కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైక్టరేట్(ఈడీ) అభ్యర్థన అనే రెండు పిటిషన్‌లపై తీర్పును ఇవ్వనుంది.
ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్‌లైన్ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ…
సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో…
మీడియాలో వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించారు. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా…
ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దుర దృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు…