Visakhapatnam: 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: ఆడవాళ్లపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. చిన్నారుల జీవితాలను సైతం చిదిమేస్తున్నారు కామాంధులు.. అయితే, కొన్ని కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా దిశా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఈ కేసులను సీరియస్‌గా తీసుకుంటున్నారు పోలీసులు.. ఇక, 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారిపై అఘాయిత్యం కేసులో.. నిందితుడు సూరిబాబుకి 20 ఏళ్ల జైలు శిక్ష , 10 వేల రూపాయలు జరిమానా విధించింది. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అభంశుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు సూరిబాబు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.. ఇక, విచారణ జరిపిన విశాఖ ఫోక్సో కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.. ఇక, ఏడాది గడవక ముందే కేసులో తీర్పు వెలువరించింది.. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు విశాఖ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి.. దీంతో.. న్యాయమూర్తి ఆనందికి ధన్యవాదలు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు.
Read Also: Bhadrachalam: భద్రాద్రి రాముడి అన్నదాన సత్రంలోకి వరద నీరు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!