నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. ఈ న్యాయమూర్తులందరినీ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. అంతే కాకుండా.. మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానితుల జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. జస్టిస్ సుధీర్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయగా.. జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది.
ఢిల్లీలో జరుగుతున్న న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. లక్ష్మణ రేఖను దాటడం మంచిది కాదన్నారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో పరిధులు గుర్తించాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు వేర్వేరు అధికారాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి 3 వ్యవస్థలు పనిచేయాలి. పిల్‌లు దుర్వినియోగం అవుతున్నాయి. పిల్‌లు వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారాయన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు.…
తెలంగాణ హైకోర్టుకు నియమితులైన పది మంది కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం పూర్తి అయ్యింది.. హైకోర్టు హాల్‌లో 10 మంది నూతన జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ.. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.. ప్రస్తుతం 19 మంది జడ్జీలు సేవలు అందిస్తుండగా.. వారికి కొత్త న్యాయమూర్తులు 10 మంది అదనంగా వచ్చిచేరారు.. నూతన న్యాయమూర్తులుగా కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, కుచాడి శ్రీదేవి, ఎన్.…