పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023 బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ ఆమోద యోగ్యమయినదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నాగోతు రమేష్ నాయుడు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ అందరికీ మేలు చేసెలా ఉంది.ఇందిరా గాంధీ తరువాత నిర్మలా సీతారామన్ మహిళగా వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ ఆమోద యోగ్యమైంది.జనరంజక పాలన చేస్తానని, అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ పెడతానని జగన్ హామీ ఇచ్చారు. ఆ పార్టీ నాయకుల అవినీతి తెలపడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ హామీనైనా జగన్ నిలబెట్టుకోవాలి. మద్య నిషేధం అన్న జగన్.. నేడు రాష్ట్రం మొత్తం ఏరులై పారిస్తున్నాడు.
Read Also: K.Raghavendra Rao: డిజిటల్ బాట పట్టిన రాఘవేంద్రుడు.. ఆరంభించిన దర్శకధీరుడు
పేదల మహిళల పుస్తెలు తెంపే విధంగా జగన్ చర్యలు ఉన్నాయి.యువతకు ఉద్యోగాలన్న జగన్.. వారిని మోసం చేశాడు.జాబ్ క్యాలెండర్ లేదు.. జాబ్ లెస్ క్యాలెండర్ తో మభ్యపెట్టారు.జగన్ కావాలని ఏరి కోరి గెలిపించిన ఉద్యోగుల హక్కులను హరించేశాడు. నేడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురు చూస్తున్నారు. రైతులకు మేలు చేస్తామన్న జగన్.. ఉన్న పధకాలు కూడా పీకేశాడు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ప్రతి అంశంలోనూ నేడు అందరూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. మార్కెటింగ్ వ్యవస్థలో మెళకువలు నేర్చుకోవాలంటే జగన్ దగ్గరకి వెళ్లండి.
ప్రజల సొమ్ముతో తన పత్రిక, ఛానల్లో కోట్ల రూపాయల యాడ్ లు ఇచ్చుకుంటారు. అవినీతి అనేది వైసీపీ డీఎన్ఎలోనే ఉంది. జగన్ చుట్టూ ఉన్న వారంతా అవినీతిలో అగ్రగణ్యులే. ప్రతిపక్షాలే కాదు.. న్యాయమూర్తులపై కూడా డేగ కన్ను పెట్టారు. జగన్ విధానాల వల్ల ఏపీ అన్ని విధాలా నాశనం అయ్యింది. ఇసుక కాంట్రాక్టు జేపీ వెంచర్ కు ఇచ్చి కోట్లు కూడేసుకున్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియా యధేచ్చగా నడుస్తుంది. గతంలో కేసలు పెట్టే వారు.. ఇప్పుడు అది కూడా లేకపోవడం.. విచ్చలవిడి తనంగా మారింది. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి చెప్పనక్కర్లేదు.
పోలీసు వ్యవస్థకు అన్ని తెలిసినా నిద్ర నటిస్తుంది. ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రిని సాగనంపాలి. టీడీపీ కూడా ఎమోషనల్ పాలిటిక్స్ కు ఆరాట పడుతుంది.రోడ్ మ్యాప్ ఆధారంగా జగన్ వైఫల్యాలను ప్రశ్నించడం లేదు. ప్రస్తుతం ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి బలం పెరుగుతుంది.ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టలేదు.. ఉద్యోగ, ఉపాధి లేదు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై బీజేపీ ప్రజా పోరు రెండోవిడత చేపడతాం.మా పార్టీ జాతీయ నాయకులు హాజరై జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను వివరిస్తారు. కళా తపస్వి విశ్వనాధ్ మరణం బాధాకరం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున సానుభూతి తెలియ చేస్తున్నాం అన్నారు.
Read Also: Workers Strike : అట్టుడుకుతున్న బ్రిటన్.. వేతనాల కోసం రోడ్డెక్కిన లక్షలాది మంది