టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” రియాలిటీ షోను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. లెక్క ప్రకారం ఈ షో మే నెల చివరి వారం నుంచి టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వచ్చిపడిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ముందునుంచి అంచనాలు వెలువడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఆ షో వాయిదా పడింది. కానీ ఎప్పటి నుంచి మొదలవుతుంది ? అనే దానిమీద ఇప్పుడు అనేక ప్రచారాలు మొదలయ్యాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ షో కరోనా కేసులు కాస్త తగ్గినట్లు అయితే ఆగస్టు నెల నుంచి టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ కరోనా ఉధృతిని తగ్గకపోతే ఈ ఏడాది పూర్తిగా షో నిలిపి వేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలా ఎంపిక చేసిన వారందరినీ అనేక వడపోతల అనంతరం సెలెక్ట్ చేసి అప్పుడు షూటింగ్ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని భావిస్తున్న నిర్వాహకులు దీని గురించి త్వరలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూడాలి ఎన్టీఆర్ షో టెలికాస్ట్ అవుతుందా లేదా అనేది.