జూనియర్ ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఎన్టీఆర్… రాజకీయాల్లోకి ఆరగేట్రం చేస్తారని టిడిపి నేతలు, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్… పొలిటికల్ ఎంట్రీపై ఏ రోజు సరిగా స్పందించిన దకళాలు లేవు. కానీ ఏపీలో అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పోస్టర్లు, బ్యానర్లు వెలుగుచూశాయి. 2024 లోపైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తితో ఉన్నారు. అయితే తాజాగా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరిలో చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాజాగా ఆయన జెండా తయారు చేసి ఆవిష్కరించారు.