Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో గుజరాత్ టైటన్స్ (GT) మే 22న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న లక్నో సూపర్ జైంట్స్ (LSG)తో మ్యాచ్‌లో ప్రత్యేక లావెండర్ రంగు జెర్సీని ధరించనుంది. ఈ నిర్ణయాన్ని జట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ చర్య క్యాన్సర్ వ్యతిరేక పోరాటాన్ని ప్రోత్సహించడానికి సంబంధించినట్లు వివరించింది. గతంలో కూడా గుజరాత్ టైటన్స్ ఇలాంటి సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా లావెండర్ జెర్సీతో అనేక సార్లు…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని…
GT vs SRH: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు, తమ ఇన్నింగ్స్‌ను మొదటి నుండే దూకుడుగా ప్రారంభించింది. Read Also: Pregnancy Tips: పిల్లలు…
GT vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో భారీ స్కోరు నమోదు చేశారు. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో 50 బంతుల్లో 5 ఫోర్లు,…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు, సిక్సర్లు, ఫోర్లలో టాప్ 3లో ఉన్నదెవరో చూసేద్దం రండి...
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోస్ బట్లర్(97) చితక్కొట్టాడు. కానీ సెంచరీ చేయలేక పోయాడు.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బెంగళూరు 8…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఆట మొదలయ్యాక ఓపెనర్ ఎవరనే విషయం తెలుస్తుందన్నాడు. బట్లర్ వంటి ఆటగాడు ఏ స్థానంలో అయినా ఆడదానికి సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. గుజరాత్ జట్టు పూర్తి ఫిట్‌గా ఉందని, ఎటువంటి గాయాలు లేవని గిల్ వెల్లడించాడు. నేడు పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు…
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు పూర్తి విఫలమైంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ బట్లర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో.. జోస్ బట్లర్ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు.