GT vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో భారీ స్కోరు నమోదు చేశారు. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. మరోవైపు, ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా 30 బంతుల్లో 39 పరుగులు చేశారు. ఆ తర్వాత జోస్ బట్లర్ 26 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక టీంలో వాషింగ్టన్ సుందర్ 8 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో షారుక్ ఖాన్ 2 బంతుల్లో 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Read Also: Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ
ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహీష్ తీక్ష్ణ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ రెండు కీలక వికెట్లు తీసి రాణించాడు. సందీప్ శర్మ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు. జోఫ్రా ఆర్చర్ మాత్రం మరోమారు భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. అతను 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి రాహుల్ తేవటియాను అవుట్ చేశాడు. వనిందు హసరంగ 4 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చినా, వికెట్ సాధించలేకపోయాడు. యుధ్వీర్ సింగ్ 3 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. ఇక 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ అందుకుంటుందో లేదో.