ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కాపు, బీసీ ఓట్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. నిన్న బీసీ సదస్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.
Jogi Ramesh: చంద్రబాబు అధికార దాహం, ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో 40 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు.. ఇంత మంది మరణాలకు కారణం అయిన చంద్రబాబుపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని నిలదీశారు.. గుంటూరులో తొక్కిసలాట ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. చంద్రబాబును అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇక, చంద్రబాబు డైరెక్షన్లోనే ఉయ్యూరు…
మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీ హాట్టాపిక్ అయ్యింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడిచింది.. చివరకు అది వైసీపీ అధిష్టానం వరకు వెళ్లింది.. ఇక, వరుసగా వివిధ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతూ వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు.. ఈ సారి మన టార్గెట్ 175కి 175…
Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. అయితే వారాహి రంగుపై విమర్శలు చెలరేగాయి. పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్…