Jogi Ramesh Fires On Chandrababu Pawan Kalyan Nara Lokesh: ఏపీ మంత్రి జోగి రమేష్ తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకడు వృద్ధ సైకో, మరొకడు పిల్ల సైకో, ఇంకొకడు అసలైన సైకో అంటూ ఆ ముగ్గురిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంత్రి మాట్లాడుతూ.. నారా లోకేష్ ఓ అప్పడంగాడు అని, గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతోందని ఫిర్యాదు చేశాడని ధ్వజమెత్తారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌కు, అసలు ఏం అర్హత ఉందని ఫిర్యాదు చేశాడని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తుంటే కనిపించటం లేదా? అని నిలదీశారు. గంజాయి సాగును పెంచి, పోషించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వమేనని.. అప్పటి మంత్రులు గంజాయి అమ్మి బతికారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
Seediri Appalaraju: పవన్‌కు మంత్రి సీదిరి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి
ఏపీ రాష్ట్రానికి పట్టిన సైతాను చంద్రబాబు, భూతం లోకేష్, పిశాచం పవన్ కళ్యాణ్ అని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అయితే కేవలం రంకేలు వేస్తుంటాడని, చర్చకు రమ్మంటే పారిపోతాడని ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా ఉన్న గంటా, అయ్యన్నే స్వయంగా గంజాయి సాగుకు విశాఖ కేంద్రంగా మారిందని చెప్పారని గుర్తు చేశారు. గంజాయి సాగు వెనుక పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారని స్పష్టంగా చెప్పారని.. ఆ పెద్ద వాళ్లంటే ఎవరని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్ గంజాయి సాగు వెనుక ఉన్నారని గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడే చెప్పారని చెప్పిన మంత్రి.. చంద్రబాబు, లోకేష్‌కు తెలియకుండానే గంజాయి స్మగ్లింగ్ జరిగిందా? అని నిలదీశారు. లోకేష్ బుర్ర తక్కువ వెధవ అని.. గంజాయి తాగి ఊగుతున్నారా? అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ జరిగితే.. ఆ దరిద్రాన్ని జగన్ శుభ్రం చేస్తున్నారన్నారు. గంజాయి సాగు జరగకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Minister RK Roja: పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్
ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. కరోనా సమయంలో జగన్ సైనికులైన వాలంటీర్లు ప్రజలను కంటికి రెప్పలా కాపాడితే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు పారిపోయారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చి విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి తాట తీస్తారని హెచ్చరించారు. దమ్ముంటే.. పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా సింగిల్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఎక్కడ నిలబడినా.. అక్కడ వాలంటీర్‌ను నిలబెట్టి, నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. అమర్నాథ్ గౌడ్ సంఘటన తమని తీవ్రంగా కలిచివేసిందని, ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పారని అన్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందించామని.. అయితే చంద్రబాబు ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.