టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి నిదర్శనం కుప్పం.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. ఆయన జెండాను, పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్… 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఏ వర్గానికి అయినా మేలు చేశాడా..? అని ప్రశ్నించిన ఆయన.. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు చంద్రబాబు ఏమీ చేశాడు అని ప్రజలు తిరుగుబాటు చేశారు.. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం…
ఏపీలో పొలిటికల్ టార్గెట్స్ పర్సనల్ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీన్ని టీడీపీ…
దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు…
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలకృష్ణ ఆరోపిస్తున్నారని.. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పనిపడతారని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు…
ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలపైనే చర్చలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలందరూ ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంత్రి జోగి రమేష్ ఈ విషయంపై స్పందించారు. సీఎం జగన్ బలంగా ఉన్నారు కాబట్టే, చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌ని సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కడుగా రాగలడా? అని ప్రశ్నించిన ఆయన.. ఆయనకు కావాల్సింది కూడా పొత్తులేనన్నారు. బలహీనులైన మనల్ని జగన్ బలవంతుల్ని…
పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచారు.. అయితే, చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననే నమ్మకాన్ని వ్యక్తం…
హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్…
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్…