Jogi Ramesh Says NTR Will Definitely Kills Chandrababu Naidu If He Alive: దివంగత నేత ఎన్టీఆర్ బతికి ఉంటే.. చంద్రబాబును శూలంతో పొడిచి చంపేవాడని ఏపీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబేనని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఓ డర్టీఫెలో అని, నకిలీకి మారుపేరు అని దుయ్యబట్టారు. 2014లో 650 వాగ్థానాలు ఇచ్చి, పట్టుమని పది వాగ్థనాలైనా నెరవేర్చావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మేనిఫెస్టోను చించి, కరకట్టుకు పార్సిల్ చేస్తామని చెప్పారు. ఏపీలో అమలవుతున్న పథకాలను చూసి, దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఓవైపు గ్రామాల్లో అభివృద్ధి, మరోవైపు ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా గతంలో చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. రైతులను, మహిళలను, అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, చంద్రబాబు గెలవడని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ సీట్లు వైసిపికే వస్తాయని జోస్యం చెప్పారు.
Kodali Nani: వంగవీటి రాధా పోటీ చేయడు.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
అంతకుముందు కూడా.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని జోగి రమేష్ మండిపడ్డారు. మురికిపట్టి మలినమైన చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. డర్టీ బాబు, డస్ట్‌బిన్ మేనిఫెస్టో అంటూ టీడీపీ మేనిఫెస్టోని చించి, డస్ట్ బిన్‌లో వేశారు. తమ ప్రభుత్వం మేనిఫెస్టోలోని 98% హామీలని అమలు చేసిందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంల్లోనూ నాలుగేళ్లలో ఇన్ని పథకాలు అమలు చేయలేదన్నారు. రెండు లక్షల 11 వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేశామని.. అలాగే 35 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించి, నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పేదల్ని ధనవంతుల్ని చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నాడని దుయ్యబట్టారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు.
Seediri Appalaraju: బాబు విజనరీ కాదు, విస్తరాకుల కట్ట.. జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు