హత్య కేసులో జైలుకెళ్లి.. పెరోల్ పై వచ్చి పెళ్లి చేసుకున్నారు..
ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో తెలియదు.. ఒక్కసారి ప్రేమలో పడితే.. చనిపోవడానికైనా సిద్ధపడిపోతారు ప్రేమికులు. అంతలా ప్రేమ మైకంలో మునిగిపోతారు. తమ ప్రేమ కోసం ఎంతటి వారినైనా వారు ఎదిరిస్తారు. అయితే, ఓ ప్రేమ జంట జైల్లో ప్రేమించుకుని పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు.. అదేనండి.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జైలులో జరిగింది. వేరు వేరు హత్యా నేరాల్లో దోషులుగా శిక్షపడి జైలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు.
ఇద్దరు నేరస్తులు హత్యా నేరంలో దోషులుగా తేలి బర్ధమాన్ సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. అయితే.. అక్కడే ఇద్దరు మొదటి సారి కులుసుకున్నారు.. అనంతరం చిగురించి స్నేహం.. కాస్త ప్రేమగా మారింది. వారి సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వివాహ వేడుక కోసం ఈ జంట ఐదు రోజులు పెరోల్‌పై రిలీజ్ అయ్యారు. అనంతరం తూర్పు బర్ధమాన్‌లోని మాంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.. పురందేశ్వరి పిలుపు
బూత్ స్థాయి నుంచి వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భారతమాత ఫొటోకి పూలమాల వేసి, ఈ సమావేశాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్టప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పథకాల్ని వివరించి.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా.. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కేశవ్ కాంత్ బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్లే చేసి చూపించారు.
10 ఏళ్ళు గడిచాయి.. మమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ చేస్తారు
కాంట్రాక్టు అనే పదం లేకుండా చేస్తా అన్నారు సీఎం కేసీఆర్.. 10 ఏళ్ళు గడిచాయి.. మమ్మల్ని ఎపుడు రెగ్యులర్ చేస్తారు..సీఎం సార్ అంటూ నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు . ఇవాళ ఉన్నత విద్యామండలిని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో పనిచేసే 1445 మంది.. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని అడ్డుకొని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వం తమను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ అభ్యంతరాలను సాకుగా చెబుతున్నారని, కానీ అలాంటి నిబంధనలు ఏమి లేవని వారు వాపోయారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ నేర్పించిన ఉద్యమ స్పూర్తితో.. ఉద్యమాలు చేస్తామన్నారు.
బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్‌గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి అబుదాబి విమానాశ్రయంలో దిగగానే.. ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
ఏపీలో బలమైన మార్పు తేవాలి.. జనసేనని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం
ఏపీలో బలమైన మార్పు తీసుకురావాలని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఆమంచి స్వాములును పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. తాను చీరాలలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. చీరాల అనగానే చినరధం, పెద్ద రధం, జాలరీ పేట గుర్తొచ్చాయని అన్నారు. ఆమంచి స్వాములకు చీరాలలోనే బలం ఉందని తాను అనుకున్నానని.. కానీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం నుంచి కూడా అభిమానులు ఉంటారని అనుకోలేదని చెప్పారు. ఆయన కోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలను చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
రేణు దేశాయ్ ఫోటో షేర్ చేసిన పవన్.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఫిదా చేశాడే
కొన్నాళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి చాలా కాలం నుంచి ఫేస్బుక్ పేజ్ తో పాటు ట్విట్టర్ కూడా మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి మాత్రం ఈ మధ్యనే ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా పెట్టకపోయినా రికార్డ్ స్థాయిలో ఆయన అకౌంటును చాలా మంది ఫాలో అయ్యారు. అది క్రియేట్ చేసిన రోజుల వ్యవధిలోనే 2 మిలియన్ అంటే ఇరవై లక్షల మంది ఆ అకౌంటును ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి మొట్టమొదటి పోస్టుగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేక మంది స్టార్ హీరోలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ వీడియోలో తన మాజీ భార్య రేణు దేశాయ్ ఫోటో కూడా ఆయన షేర్ చేశాడు. ఆ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలని సినీ పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు తాను కృతజ్ఞుడిని అని చెబుతూ దాదాపుగా రెండు నిమిషాల 35 సెకండ్ల నిడివి గల వీడియోని ఆయన షేర్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్
ఏపీ మంత్రి రోజా మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. పవన్‌కు ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముందని అన్నారు. పవన్ పిచ్చాసుపత్రి నుండి పారిపోయిన వ్యక్తిలాంటి వాడని విమర్శించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని పవన్‌కు జగన్‌ను విమర్శించే స్థాయి లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టుకొలేని పార్టీ జనసేన పార్టీ అని ఎద్దేవా చేశారు. 2024లో ప్రజలందరూ జగనన్న క్రీడా సంబరాలల్లో ఆడుకుంటే.. పవన్, చంద్రబాబులతో సీఎం జగన్ ఆడుకుంటారని పేర్కొన్నారు.
పవన్‌కు మంత్రి సీదిరి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి
జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. కాకినాడ జిల్లా నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గెలవాలని సవాల్ విసిరారు. పవన్ తాగేసి మాట్లాడే ఓ పనికిమాలినోడని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం తప్ప, ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో తెలుసా? అని పవన్‌ని నిలదీశారు. నిన్ను కూడా పీకే గాడు, వీపీ గాడు అని తాము ఏకవచనంతో అనలేమా? అని అన్నారు. తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. జన్మభూమి కమీటీలు అరాచకాలు చేసినప్పడు.. పవన్ కళ్యాణ్ ఐస్‌క్రీమ్ తింటున్నాడా? అని నిలదీశారు.
కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, మహేశ్వర్ రెడ్డి లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై వివక్షత చూపుతుందని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి తాగు, సాగునీటి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా వ్యవరించిందని చెప్పారు. ఇప్పటికె ప్రాజెక్టు పనులు 85%పూర్తి అయ్యాయాని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చేవెళ్ల, వికారాబాద్, పరిగి,తాండూరు నియోజకవర్గ పరిధిలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కు అనుమతులు, జాతీయ హోదా ఇచ్చేవరకు బీఆర్ఏస్ ప్రభుత్వం, పార్టీ ఎంపీలు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో మరోసారి భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ( శనివారం ) సాయంత్రం ఆరు గంటల తర్వాత మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు వానా పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. దీంతో వర్షం గట్టిగానే దంచి కొడుతుంది. ఈ పరిస్థితితో ఇప్పటికే వరద గుప్పిట్లో ఉన్న హస్తిన.. కోలుకునేందుకు ఇంకాస్త టైమ్ పడేలా కనబడుతుంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా.. భారీ వర్షాలు.. పైగా యమునా నదీకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో దేశ రాజధాని ప్రాంతం నీట మునిగింది. ఈ క్రమంలో ఓవైపు వర్షం ఆగిపోయినప్పటికీ.. అప్పటికే పోటెత్తిన వరదతో యమునా నదిని డేంజర్ జోన్‌కి చేరుకుంది. దీంతో యమున నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు ఢిల్లీ ప్రభుత్వం తరలించింది. ఈలోపు నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఒకడు వృద్ధ సైకో, మరొకడు పిల్ల సైకో, ఇంకొకడు అసలైన సైకో.. మంత్రి జోగి రమేష్
ఏపీ మంత్రి జోగి రమేష్ తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకడు వృద్ధ సైకో, మరొకడు పిల్ల సైకో, ఇంకొకడు అసలైన సైకో అంటూ ఆ ముగ్గురిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంత్రి మాట్లాడుతూ.. నారా లోకేష్ ఓ అప్పడంగాడు అని, గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతోందని ఫిర్యాదు చేశాడని ధ్వజమెత్తారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌కు, అసలు ఏం అర్హత ఉందని ఫిర్యాదు చేశాడని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తుంటే కనిపించటం లేదా? అని నిలదీశారు. గంజాయి సాగును పెంచి, పోషించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వమేనని.. అప్పటి మంత్రులు గంజాయి అమ్మి బతికారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.