ఏపీలో ఇవాళ జరిగిన వైసీపీ కీలక సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం.. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో జరిగిన గడపగడపకు కార్యక్రమం సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన.. గృహ సారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తి చేసుకోవాలి.. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి.. వాలంటీర్లను, గృహ సారథులను మమేకం చేయాలి.. వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలంటూ జగన్ ఉద్బోధ చేశారు.
Read Also: Karnataka elections: కర్ణాటక ఎన్నికల్లో సరికొత్త వ్యూహం.. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీవీ తో మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోకపోతే టికెట్ ఇవ్వననటంలో తప్పేం లేదు.మళ్ళీ ప్రభుత్వంలోకి రావటం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు నెలకు 25 రోజుల పాటు గడప గడప చేపట్టాలని చెప్పారు. 4 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. 175 స్థానాల్లో గెలుస్తాం అని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబుకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దుమ్ము ఉందా??గెలిచే దమ్ము లేకే దత్త పుత్రుడు, సీపీఐ, సీపీఎం అందరూ రావాలని పిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం పార్టీతో ఉంటాడో అతనికే తెలియదని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏ సంజాయిషీ ఇవ్వటానికి ఢిల్లీకి వెళ్ళాడు? పవన్ చంద్రబాబు పంచన ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేయడు అన్నారు.
Read Also: 10th Exam Paper Leak: పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ లైవ్