ఏపీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలపై రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పల్నాడులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు, తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. సినీ హీరో రజనీకాంత్ పై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. రజనీకాంత్ గొప్ప నటుడు కానీ అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదు. చంద్రబాబును పొగడడానికి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చాడనిపిస్తుంది. రజనీకాంత్ రాజకీయాలకు వస్తానని చెప్పి పారిపోయిన వ్యక్తి.. రాజకీయాలకు పనికిరాని పిరికిపంద అన్నారు.
Read Also: KKR vs GT: రప్ఫాడిస్తున్న గుర్బాజ్.. 10 ఓవర్లలో కేకేఆర్ స్కోరు ఇది!
ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు చంద్రబాబు పక్కన రజినీకాంత్ కూడా ఉన్నాడని ప్రచారం ఉంది..ఎన్టీఆర్ ని పొగడకుండా చంద్రబాబును పోగడం ఆశ్చర్యకరం.సినీ నటుడు ఎన్టీఆర్ రాజకీయ పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని పొగడడం దుర్మార్గం అని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అని కాదు పేరు పెట్టాల్సింది.. ఎన్టీఆర్ ను చంపిన ఖూనీకోరుల సంబరాలు అని పెడితే సరిగ్గా సరిపోయేది. మీరే చంపి, మీరే దండేసి, మీరే దండం పెడతారు.. 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారత రత్న కోసం పోరాడతాడట అని ఎద్దేవా చేశారు. ఈ 27 ఏళ్ళల్లో 14 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు… కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబు అప్పుడు ఎందుకు అవార్డు ఇప్పించ లేదు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుతో చేతులు కలిపాడు రజనీకాంత్.. బావతో చేతులు కలిపి కన్నతండ్రి చావుకు కారణమైన బాలకృష్ణ ఇప్పుడు ఎన్టీఆర్ ని యుగ పురుషుడు అంటున్నాడని మండిపడ్డారు జోగి రమేష్.
వంగవీటి మోహన రంగా హత్యకు చంద్రబాబు కారణం.చంద్రబాబు రాజకీయం అంతా రక్త చరిత్ర. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు పాదయాత్ర అంటాడు.జగన్ పాదయాత్ర చేస్తే ఇప్పుడు బఫూన్ పాక్కుంటూ వెళుతున్నాడు. అన్నీ కాపీ కొట్టే వ్యవహారాలే. నారాసుర రక్త చరిత్ర అని మేం పుస్తకం వేస్తే ఇప్పుడు కాపీ కొడుతున్నారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే చంద్రబాబును, లోకేష్ ను చెప్పుతో కొట్టాలి..చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయండి..లోకేష్ ను కూడా నిలదీయండి అన్నారు జోగి రమేష్.
Read Also: Adimulapu Suresh: ప్రతి కుటుంబానికి జగనన్న మేలు చేశారు