సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని మండిపడ్డారు. అరెస్ట్ నేపథ్యంలో పోసాని భార్య కుసుమలతను జగన్ ఫోన్‌లో పరామర్శించారు. అరెస్ట్ విషయంలో పోసానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని.. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ‘ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోంది. అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి తెలిపారు. తమ నాయకుని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే.. తాము కూడా మాట్లాడాలి అనుకున్నాం కానీ పవన్ వద్దని సూచించారని చెప్పారు. సంస్కారం అడ్డువచ్చే తాము అలా మాట్లాడలేదని, పోసాని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పోసానిపై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా..…