Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా బుల్లెట్లు పేల్చారు. అయితే ఆ బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలి తప్పిపోవడం విశేషం.
Giorgia Meloni Uncomfortable: అమెరికా ప్రెసిడెంట్ శిఖరాగ్ర సమావేశానికి ఆలస్యంగా రావడం వల్లే జార్జియా మెలోని అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. దీని కారణంగా నాటో సదస్సు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందన్నారు.
Elon Musk: యూఎస్ బిలినీయర్ ఎలన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు.. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్నారు.
Giorgia Meloni: నాటో సమ్మిట్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాటో శిఖరాగ్ర సమావేశం మూడో రోజున అమెరికా ప్రెసిడెంట్ ఆలస్యంగా రావడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Joe Biden: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలు సమావేశాల్లో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 సమావేశాల్లో దేశాధినేతలంతా ఫోటోలకు ఫోజ్ ఇస్తుంటే, బైడెన్ మాత్రం వేరే వైపు వెళ్లడం, అక్కడ ఎవరూ లేకున్నా చేతులతో అభివాదం చేయడం వైరల్‌గా మారింది.
దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు.
వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ ప్రోగ్రాంలో మంగళవారం ఆయన ఈ కామెంట్స్ చేశారు. జెట్ లాగ్ వల్ల వచ్చిన అలసట వల్లే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబేట్ లో సరిగ్గా వాదించలేకోపోయానని జో బైడెన్ వెల్లడించారు.
Biden vs Trump debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారిగా వీరిద్దరు తలపడ్డారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫోటోగ్రాఫ్ కోసం సభ్యదేశాల దేశాధినేతలు ఫోజ్ ఇచ్చే సమయంలో వారి నుంచి దూరంగా వెళ్లిన బైడెన్ అభివాదం చేయడం వీడియోలో కనిపించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్‌హౌస్ జునెటీన్త్ వేడుకల్లో జో బైడెన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సంగీతం, నృత్యాలతో ఎంజాయ్ చేస్తుంటే.. బైడెన్ మాత్రం దిష్టి బొమ్మలా అలాగే కదలకుండా ఉన్నారు