Israel-Iran Conflict: ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1 నాటి వైమానిక దాడికి ప్రతిగా ఆ రోజు ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది.
ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ప్రధాని నెతన్యాహుకు తెలిపాను అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది.
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, గాజా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలతో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ విమర్శలు, ఆరోపణ ధాటి ఎక్కువ అవుతోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Joe Biden: పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు పాకిస్తాన్‌కి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి లేఖ రాశారు.
Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్తపాతం చేస్తానని బెదిరించారు. ఒహియోలో జరిగిన బహిరంగ సభలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈసారి తనను ఎన్నుకోకపోతే దేశంలో 'రక్తపాతం' మొదలవుతుందని అన్నారు.
వైట్ హౌస్ రేసులో సూపర్ మంగళవారం అతిపెద్ద రోజు. అధ్యక్ష ప్రాథమిక క్యాలెండర్‌లో అత్యధిక రాష్ట్రాలు ఓటు వేసే రోజు. మార్చి 5న, 16 యూఎస్ రాష్ట్రాలు, ఒక భూభాగంలోని ఓటర్లు అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేశారు. ప్రెసిడెంట్ జో బైడెన్, అతని ముందున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగుతున్నారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.