Elon Musk: యూఎస్ బిలినీయర్ ఎలన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు.. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్నారు. అయితే, ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా ప్కాయ్ అనే కంపెనీకి మస్క్ భారీ ఎత్తున విరాళాలు ఇచ్చినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న జో బైడెన్ పై మస్క్ ఇటీవల విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ కోసం పని చేసే అమెరికా ప్యాక్ సంస్థకు ఎలాస్ మస్క్ ఎంత మొత్తంలో విరాళం ఇచ్చారనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. కానీ ఆ సంస్థ మాత్రం ఈనెలలోనే డోనార్ల జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Read Also: Assembly By Poll Result: కొనసాగుతున్న బైపోల్ ఓట్ల లెక్కింపు..
అయితే, రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా వచ్చే వారం డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌తో పాటు ఇతర సంపన్న దాతలతో ఇటీవల ట్రంప్ భేటీ అయ్యారు. సుమారు 263 బిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్న బిలినీయర్ మస్క్ తొలుత రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో.. ఆయన రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా మద్దతు చేస్తున్నట్లు తెలుస్తుంది. తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)లో డెమోక్రాటిక్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తున్న కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నిజానికి పబ్లిక్‌గా ఎవరికి సపోర్ట్ ఇస్తారన్న విషయాన్ని ఎలాన్ మస్క్ క్లారిటీగా ఇప్పటి దాకా చెప్పలేదు.