అమెరికా సేనలు వైదొలిగిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. అమెరికా వెచ్చించిన లక్షల కోట్ల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆఫ్ఘన్ సైనికులు తాలిబన్లను సమర్థవంతంగా అడ్డుకుంటారని అందరూ అనుకున్నారు. కాని, వారు చేతులెత్తేయడంతో తక్కువ రోజుల్లోనే తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడం, కొన్ని తప్పుడు వార్తల ద్వారా ఘనీ ఆగమేఘాలమీద దేశాన్ని విడిచి వెళ్లడం జరిగింది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు చివరి సారిగా బైడెన్‌తో మాట్లాడారు. తాలిబన్లు ఒంటరిగా పోరాటం చేయడం లేదని, వారికి మద్దతుగా పాక్‌కు చెందిని 10 నుంచి 15 వేల మంది ఉగ్రవాదులు అండగా ఉన్నారని, పాక్ నుంచి వారికి పూర్తి సహకారం ఉందని బైడెన్‌కు అధ్యక్షుడు ఘనీ ఫోన్ ద్వారా తెలిపారు. తాము తాలిబన్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎయిర్ సపోర్ట్ అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. బైడెన్ నుంచి హామి వచ్చిన తరువాత దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. సేనలను పునరుద్దరిస్తున్నట్టు పేర్కొన్నారు. తాలిబన్లతో పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ ప్రసంగం చేసిన మూడో రోజే తాలిబన్లు కాబూల్ సరిహద్దులకు చేరుకున్నాయి. దీంతో ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.
Read: ఆ దొంగలు దొంగతనం చేసి యజమాని కాళ్లకు మొక్కారట… ఎందుకంటే…