నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటితో ముగియాల్సిన గ్రూప్-4 ఉద్యోగాల గడువును మరోసారి ఏపీపీఎస్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగుల అభ్యర్థనతో ఏపీపీఎస్సీ మరోసారి గడువు పెంచింది. దీంతో ఫిబ్రవరి 6 వరకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. రెవెన్యూ డిపార్టుమెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ డెడ్‌లైన్ ఈరోజుతో ముగియాల్సి ఉంది. Read Also: ప్రధానికి సీఎం జగన్ లేఖ.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?…
తెలంగాణ లో ఉద్యోగాలు లేవనే అబద్ధప్రచారం జరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియామకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, లక్ష 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ లో 19 వేలు, బీహార్ లో 8.950 కర్ణాటక 14,893, మహారాష్ట్రలో 8వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్…
కరోనా ఒక వైపు వీరవిహారం చేస్తున్నా ఉద్యోగ నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనబడుతోంది. 2021 ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకూ జరిగిన నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనిపించింది. గత ఏడాది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి జూన్ వరకూ జరిగిన నియామకాలతో పోలిస్తే వృద్ధిరేటులో పురోగతి కనిపించింది. ఇండీడ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2021 ప్రథమార్థంలో ఉద్యోగాల కల్పన 44 శాతం జరిగితే ద్వితీయార్థంలో మాత్రం అది 53…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే…
రైల్వేశాఖలో భారీగా పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-డిలో పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 23న పున:ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 9,328 పోస్టులకు ఈనెల 23 నుంచి దశలవారీగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోస్టులలో ట్రాక్‌మన్ విభాగంలో 4,753, పాయింట్స్‌మెన్‌లు 1,949, హాస్పిటల్ అటెండర్లు 37, మిగతా పోస్టుల ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. Read Also: వాట్సాప్ ద్వారా క్రిప్టో…
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉండగా.. వీటికి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా మరో 8 జత కానున్నాయి. దీంతో మొత్తం 18 కాలేజీల్లో సహాయ ఆచార్యులను నియమించనున్నారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. ‘సినతల్లి’కి ఇల్లు కట్టిస్తానని హామీ కొత్తగా నెలకొల్పనున్న…
సీఎం కేసీఆర్ మరోసారి మీడియాముందుకు వచ్చారు. ఈ సం దర్భంగా సీఎం మాట్లాడుతూ…. దళిత సీఎంను చేయలేదని దానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. షబ్బీర్ అలీ కూడా ఈ విషయం చెప్పారు. నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు. రెండోసారి 83 సీట్ల లో మళ్లీ గెలిపించారు. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 78 వేల ఉద్యోగాలు ఇస్తాం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం జోనల్ ఆమో దం విషయంలో కొర్రీలు పెడుతుంది. జోనల్ ఆమోదం…
అమరావతి : దేవదాయ శాఖలో వీలైనంత త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. దేవదాయ శాఖపై ఇవాళ మంత్రి వెలంపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ… దేవదాయ శాఖలో నాడు-నేడు తరహాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని… దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవదాయ శాఖలో ఇతర శాఖల అధికారులను నియమించక తప్పని పరిస్థితి ఉందని… ఇతర శాఖలకు చెందిన హిందువులను మాత్రమే దేవదాయ శాఖలో నియమిస్తామని తెలిపారు.…
చదివిన చదువుకు తగిన ఉద్యోగం కావాలని నిరుద్యోగులు కోరుకుంటారు. కానీ వారి ఆశలు ఆవిరవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ సరైన ఉద్యోగాల భర్తీ జరగలేదు. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు అవుతోంది. వయసు మీదపడుతోంది. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగులకు ఇబ్బందిగా మారాయి. దీనికి తోడు చిన్నాచితకా ఉద్యోగాలు చేద్దామన్నా కరోనా మహమ్మారి వల్ల అవి కూడా కుదరడం లేదు. రాష్ట్రంలోని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జంబో ఉద్యోగ ప్రకటన ఇంకెప్పుడు…