ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో 4,775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నియామకాలను అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు…
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్టయిలే వేరు. రాజకీయంగా ఎంత బిజీగా వున్నా తన పర్యటనలు మాత్రం కొనసాగిస్తూనే వుంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని కంది ఐఐటీ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల జగ్గారెడ్డి ,కుమార్తె జయరెడ్డి ,కుమారుడు భరత్ సాయి రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న యువతతో పాటు నియోజకవర్గంలోని యువతకు ,నిరుద్యోగులకు ఉద్యోగాల పై ఐఐటీ డైరెక్టర్ తో సమావేశంలో…
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు. నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు…
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూ ఐ ఆందోళనలకు దిగింది. ఈ డిమాండ్ తోనే టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు ఎన్ ఎస్ యుఐ కార్యకర్తలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్…
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధారణ డిగ్రీలు…
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 80వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో…
దేశానికి వెలుగును అందిస్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిరాదరణకు లోనవుతోందని మండిపడ్డారు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పేందుకు రామగుండం సింగరేణి దోహదపడింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన రామగుండం లో బిపిఎల్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ను చీకటి మాయం చేయాలని చూస్తున్నారు.రామగుండం ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం లో జరుగుతున్న బుడిద మాఫియా పై విజిలెన్ విచారణ…
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…
ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు సాధించుకున్నట్లే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో భాగంగా 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్‌లు జారీ అవుతాయని తెలిపారు. ఇకపై వివిధ శాఖలలో ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు…