తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. అందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పోలీస్…
తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు…
ఈరోజు మహిళా దినోత్సవం. నిజం చెప్పాలంటే ఏదో ఒక రోజు కాదు. ప్రతి రోజు స్త్రీమూర్తులదే. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా మమతానురాగాలు పంచే స్త్రీమూర్తికి ప్రతిరోజూ మహిళా దినోత్సవమే. మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిధిదేవోభవ అని “స్త్రీ”ని ఉపనిషత్తులో అందరికంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.స్త్రీ అను పదములో ‘స’కార, ‘త’కార, ‘ర’కారములున్నాయి. ‘ స’ కారము సత్వగుణానికి,’త’ కారము తమోగుణానికి, ‘ర’ కారము రజోగుణానికి ప్రతీకలుగా మన పెద్దలు చెబుతారు. ప్రకృతికి ప్రతీకగా స్త్రీని చెబుతారు. నేడు స్త్రీలు…
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి.…
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది.. ఇవాళ గోండా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. వెంటనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. ఇక, యువత నిరసనపై స్పందించిన రాజ్‌నాథ్ సింద్.. న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి శాంతింపజేశారు.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోళీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్…
కరోనా కాలంలో సాఫ్ట్‌వేర్‌మొదలు చాలా రంగాలు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. ఐటీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటిదగ్గర నుంచి ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. అనుకున్న విధంగా వర్క్ ముందుకు సాగదు. ఇంట్లో ఇబ్బందులు సహజమే. అయితే, యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తూ అక్షరాల ఏడాదికి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడట. అతను 6 కంపెనీలకు ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాడు. ఆరూ ఫుల్‌టైమ్…
కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలసకూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లిపోయారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్‌డౌన్ విధించడంతో అన్ని రంగాలు ఒక్కసారిగా మూతపడ్డాయి. 2020 మార్చి నుంచి జూన్ 2020 వరకు సుమారు 23 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగాలతో పాటు లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయారు. మ్యానుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్టింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్, హాస్పిటాలిటీ, బీపీవో వంటి…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఆయన.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారు. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్…
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రేపో.. మాపో మరో 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త జోనల్ విధానంతో యువతకు కావాల్సిన హక్కులు సాధించామని ఆయన తెలిపారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5శాతం మాత్రమే నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని కేసీఆర్…