దేశానికి వెలుగును అందిస్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిరాదరణకు లోనవుతోందని మండిపడ్డారు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పేందుకు రామగుండం సింగరేణి దోహదపడింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన రామగుండం లో బిపిఎల్ రాలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ను చీకటి మాయం చేయాలని చూస్తున్నారు.రామగుండం ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం లో జరుగుతున్న బుడిద మాఫియా పై విజిలెన్ విచారణ జరిపించాలి. కుందనపల్లి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించి, పునరావాసం కల్పించాలి. నిరుద్యోగులకు అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేయడం ఆహ్వానిస్తున్నాం కానీ ఆచరణ చేసి చూపించండి. రామగుండం జెన్ కో,మరియు ఇతర విద్యుత్ సంస్థ లో పనిచేస్తున్న ఆర్టిజన్ ,కాంట్రాక్టు ఉద్యోగుల ను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అసెంబ్లీలో బీ పవర్ హౌస్ ను విస్తరణకు హామీ ఇప్పించాలి. లేదంటే రామగుండం ప్రజలకు క్షమాపణ చెప్పలని డిమాండ్ చేశారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.