జేఎన్టీయూ విద్యార్ధుల ఆందోళనను తాను వీసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళన విషయమై తాను వీసీతో మాట్లాడినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఈ విషయమై తనతో చర్చించేందుకు వీసీ రాజ్ భవన్ కు రెండు దఫాలు వచ్చారని ఆమె గుర్తు చేశారు.
ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకి స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. పోలవరం,ఉత్తరాంధ్ర జిలాల్లో ప్రాజెక్టులు కడుతున్నాము. బీజేపీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది. జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు…
ప్రముఖ విద్యావేత్త, కవి, ఇంజనీర్ డా. వి.మాలకొండారెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయనను ఉండేల మాలకొండారెడ్డి అంటేనే అంతా గుర్తుపడతారు. చిన్న తనం నుంచే ఆయన కవిత్వం చెప్పేవారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి పొందారు. మాలకొండారెడ్డి 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువు ముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బీఈ డిగ్రీ పూర్తిచేశారు. ఎడిన్‌బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి…
ఉన్నత విద్యా వేదికలైన యూనివర్సిటీలను ఇంకా ర్యాగింగ్ బూతం వెంటాడుతూనే ఉంది.. వర్సిటీల్లో, కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్ పై నిషేధాన్ని విధించినా కొన్ని చోట్ల ఇంకా ర్యాగింగ్ కొనసాగడం ఆందోళన కలిగించే విషయం.. తాజాగా, సోషల్ మీడియా వేదికగా జేఎన్టీయూ విజయనగరం క్యాంపస్ విద్యార్థి తన గోడు వెల్లబోసుకున్నారు.. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..! నా పేరు శ్రీనివాస్.. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం బాగా ఎక్కువగా వుంది. సంక్రాంతి కోసం ఇప్పటికే చాలామంది తమ ఊళ్లకు వెళ్లారు. వీరంతా హైదరాబాద్ వస్తే కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ ప్రభావంతో తెలంగాణలో విద్యా సంస్థలపై ఆ ప్రభావం మరోసారి గట్టిగా పడేలా ఉంది. కేసులు భారీగా పెరుగుతున్న వేళ, మరోసారి పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదముంది. దీంతో సంక్రాంతి సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈనెల…
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల ధనదాహానికి అంతులేకుండా పోతోంది. లక్షలు మిగుల్చుకోవడానికి ఫేక్ ప్రొఫెసర్లు, ఫేక్ లెక్చరర్లతో పాఠాలు చెప్పిస్తున్నారట. కాకినాడ JNTU పరిధిలో ఉన్న 180 కళాశాలల్లో దాదాపు 200 మంది ఫేక్ లెక్చరర్లు ఉన్నారట. ఇది బహిరంగ రహస్యమే అయినా.. JNTU పట్టనట్టు వ్యవహరించడమే అనుమానాలకు తావిస్తోందట. నకిలీ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో 200 మంది అధ్యాపకులు?రూ.40వేల వేతనం ఇస్తోన్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు..? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాల్లో…
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు జేఎన్‌టీయు కు చెందిన ముగ్గురు విద్యార్ధులు ఎంపికయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ముగ్గురు విద్యార్ధులను మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంపిక చేసుకుంది. సాయి అస్రిత్ రెడ్డి, స్పూర్తిరాజ్, మహ్మద్ మూర్తుజాలు ఎంపికైనట్టు ఆ టెక్ దిగ్గజ సంస్థ తెలియజేసింది. సంవత్సరానికి రూ.41 లక్షల వేతనంతో వీరిని ఎంపిక చేసుకున్నది. జేఎన్‌టీయు నుంచి మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైన వారిలో వీరిదే అత్యధిక వేతనం కావడం విషేషం. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల ఎంపికయ్యాక ఆ సంస్థలో భారతీయులకు…