PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో విమానంలో టెక్నికల్ స్నాగ్ ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్‌లో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే వరకు విమానం అక్కడే ఉంటుంది. దీంతో ప్రధాని ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం కానుంది.
Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తీవ్ర దాడిని ప్రారంభించారు.
PM Modi: మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ధులేలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
దేశంలో దీపావళి ముగిసింది. కానీ జార్ఖండ్‌లో మాత్రం పొలిటికల్ టపాసులు పేలుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమవారం ప్రధాని మోడీ.. హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై విరుచుకుపడగా.. మంగళవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yogi Adityanath: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అలంగీర్ ఆలం తన సన్నిహితుడి ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయనను సీఎం యోగి ‘ఔరంగజేబు’తో పోల్చారు. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే ఆలంగీర్ రాష్ట్రంలోని పేదలను దోచుకున్నాడని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఔరంగజేబు…
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత, ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. సోమవారం గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై జార్ఖండ్లోని అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసిసి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
Jharkhand Elections 2024: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో పాల్గొననున్నారు.
రెండు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు మళ్లీ ప్రచారానికి దిగాయి. దళితుల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి.
జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపై సోరెన్ ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్ ఎన్నికలపై చర్చించేందుకు బీజేపీ నాయకత్వంతో చంపై సోరెన్ సమావేశం అయ్యారు.