Dinesh Gope: ఎన్నో ఏళ్లుగా పోలీసులును, భద్రతా సంస్థల్ని ముప్పుతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ దినేష్ గోపే పట్టుబడ్డాడు. ఇండియా నుంచి పారిపోయి నేపాల్ లో ఉంటున్న గోపేను జార్ఖండ్ పోలీసులు, జాతీయ భద్రత ఏజెన్సీ(ఎన్ఐఏ) జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడ్డాడు. అతని తలపై రూ.30 లక్షల రివార్డ్ ఉంది. ఆదివారం నిషేధిత తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) అధినేత దినేష్ గోప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని నేపాల్…
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 16 దళిత బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హుస్సేనాబాద్ లో జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, ఊరి చివరకు తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేస్తామని సదరు బాలికను నిందితులు బెదిరించారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నా రులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
Elephants Attack: జార్ఖండ్ రాష్ట్రంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. లతేహార్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తొక్కి చంపేశాయి. చనిపోయిన బాధితుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో మల్హాన్ పంచాయతీ వద్ద ఇటుక బట్టీ యూనిట్ సమీపంలోని తాత్కాలిక గుడిసెలో 30 ఏళ్ల కూలీ ఫను భుయిన్యాన్ తన 26 ఏళ్ల భార్య బబితా దేవి, మూడేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన…
Ladies Romance: ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానం అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. బైక్ రైడింగ్ అంటే ఇదివరకు మగాళ్లు మాత్రమే చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లలో చైతన్యం వచ్చింది. వారు కూడా బైకులపై రయ్యుమంటూ దూసుకెళ్తున్నారు.
జార్ఖండ్‌లోని గిరిదిహ్లో జరిగిన ఒక వివాహానికి ఉచిత భోజనం కోసం దొంగచాటుగా వచ్చిన కొంతమంది ఆహ్వానం లేని అతిథులు, వేడి పూరీలను వేయలేదని తిరస్కరించిన తర్వాత భారీ గందరగోళం సృష్టించారు. ఆ పెళ్లిలో వేడివేడి పూరీల కోసం రచ్చరచ్చ చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గొడవ ముగిసింది.
Cyber Crime : దేశ రాజధాని ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలోని ‘మేవాత్’లో సైబర్ నేరగాళ్లపై హర్యానా పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. ఇక్కడి 14 గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.
టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మూడు నెలల చిన్నారికి వ్యాక్సిన్ వేసిన 24 గంటల తర్వాత మరణించినట్లు ఆరోగ్య అధికారి శుక్రవారం తెలిపారు.
Food Poisoning: జార్ఖండ్ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పాడైన ‘‘ చాట్ మసాలా’’తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ఈ రోజు తెలిపారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్మతాండ్ పంచాయతీ పరిధిలో జరిగింది.