జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రామనవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గత రాత్రి రెండు గ్రూపులు ఘర్షణ పడటంతో అల్లర్ల నియంత్రణకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. శాస్త్రినగర్‌లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు.
Man beats 12th wife to death in jharkhand: జార్ఖండ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఇక్కడ విషయం ఏమిటంటే మరణించిన మహిళ, నిందితుడికి 12వ భార్య. వివారాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్ దార్ పంచాయతీలోని తారాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Encounter: జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరుగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న సమాచారం అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు.
కన్న బిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సి తల్లి నవజాత శిశువును నిర్ధాక్షిణ్యంగా అమ్మేందుకు సిద్దమైంది. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో నవజాత శిశువును పుట్టిన వెంటనే అమ్మేసింది ఓ తల్లి.
Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.
Restrictions on Ram Navami celerations: రామనవమి ఉత్సవాలపై జార్ఖండ్ లోని జెఎంఎం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా హజారీబాగ్ లో దీనిపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో మసీదు ముందు ప్రవేశద్వారం ఏర్పాటు చేయడం హింసకు దారి తీసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వం రామనవమిపై ఆంక్షలు విధించింది. హజారీబాగ్ లో ప్రతీ ఏటా రామనవమి వేడులకు అట్టహాసంగా జరుగుతాయి. అయితే రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి సంగీతాన్ని…
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు.