Ladies Romance: ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానం అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. బైక్ రైడింగ్ అంటే ఇదివరకు మగాళ్లు మాత్రమే చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లలో చైతన్యం వచ్చింది. వారు కూడా బైకులపై రయ్యుమంటూ దూసుకెళ్తున్నారు. వారు బైక్ రైడింగ్ చేస్తూ, వాటిపై విన్యాసాలు కూడా చేసేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. ఆ అమ్మాయిల వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్టంట్స్ చేసేటప్పుడు అమ్మాయిలు అస్సలు భయపడకుండా రొమాంటిక్ ప్రొజెక్షన్స్‌లో స్టంట్స్ చేశారు.
Read Also : DGP Anjani Kumar : మావోయిస్టు కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం
అమ్మాయిలిద్దరూ సాధారణ దుస్తులలో కనిపిస్తున్నారు. బైక్ ట్యాంక్‌పై ఓ అమ్మాయి కూర్చుని ఉంది. విన్యాసాలు చేస్తూ ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. కొన్ని సెకన్ల తర్వాత అమ్మాయిలు ప్రజలను షాక్ చేసే పనిని చేశారు. ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలు కూడా కౌగిలించుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ తరహాలో బైక్‌లపై విన్యాసాలు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ స్టంట్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు బైక్ హ్యాండిల్ అస్సలు పట్టుకోలేదు. ఈ వీడియో చాలా మందికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్స్ ఆఫ్ జార్ఖండ్ పేరుతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసినప్పటి నుంచి యూజర్లు విస్తుపోతున్నారు. ఒక వ్యక్తి ఈ వీడియోను జార్ఖండ్ పోలీసులకు ట్యాగ్ చేయండి అని కామెంట్‌లో రాశారు.
Read Also :Jailer: అంతమంది స్టార్లు ఎందుకురా బుజ్జి.. రజినీ ఒక్కడు చాలాడా..?