Ranchi: జార్ఖండ్‌లోని రాంచీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఒక హోటల్ యజమాని తన రెస్టారెంట్‌లోనే కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఓ వ్యక్తి రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్‌వెజ్ బిర్యానీ వడ్డించడంపై జరిగిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం. కాంకే – పిథోరియా రోడ్డులో ఉన్న ‘చౌపాటీ’ అనే రెస్టారెంట్‌కు చెందిన యజమాని విజయ్ కుమార్ ను శనివారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. హత్య సమాచారం అందుకున్న వెంటనే రాంచీ రూరల్ ఎస్పీ ప్రవీణ్ పుష్కర్, కాంకే పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు రాంచీలోని ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. అలాగే సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.
Revanth Reddy: గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం!
పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి ఒక కారులో నలుగురు యువకులు సేఫ్ చౌపాటీ రెస్టారెంట్‌కు వచ్చారు. రెస్టారెంట్‌లోకి రాగానే వారు హోటల్ యజమాని విజయ్ కుమార్‌కు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే, యజమాని పొరపాటున వారికి వెజ్ బిర్యానీకి బదులు నాన్‌వెజ్ బిర్యానీ వడ్డించారు. ఈ పొరపాటుకు ఆగ్రహించిన యువకులలో ఒకరు, తన నడుము నుంచి తుపాకీ తీసి హోటల్ యజమాని విజయ్ కుమార్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. హత్య జరిగిన వెంటనే నిందితులంతా కారులో పిథోరియా మీదుగా పారిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది.
K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్
స్థానికులు వెంటనే హోటల్ యజమాని విజయ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేవలం బిర్యానీ ఆర్డర్ పొరపాటు కారణంగానే ఈ హత్య జరిగిందా..? లేక దీని వెనుక మరేదైనా పాత పగ..? లేదా వ్యక్తిగత వైరం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.