జార్ఖండ్‌లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అధికార మార్పిడి జరుగుతుందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. హేమంత్ సోరెన్ సర్కార్.. కమలంతో జతకట్టబోతుందంటూ ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతిపై పుతిన్ 5 గంటలు చర్చలు.. చివరికి తేలిందిదే!
ఇటీవల హేమంత్ సోరెన్-కల్పనా సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బీజేపీ అగ్ర నాయకులను రహస్యంగా కలిసి మంతనాలు జరిపినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హేమంత్ సోరెన్ ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లుగా కథనాలు పేర్కొంటున్నాయి. బీజేపీతో పొత్తుకు కల్పనా సోరెన్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర
బీహార్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి సరిగ్గా పట్టించుకోలేదని హేమంత్ దంపతులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో హేమంత్ సోరెన్ దంపతులు రహస్య చర్చలు జరిపినట్లుగా సమాచారం. అయితే అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం జరగడంతో జేఎంఎం సోషల్ మీడియాలో కీలక పోస్ట్ పెట్టింది. ‘జార్ఖండ్ తలవంచదు’ అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ పోస్ట్ అర్థం వేరే అంటూ మాట్లాడుతున్నారు.

పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జేఎంఎం నాయకుడు వినోద్ పాండే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటన వ్యక్తిగత హోదాలోనే జరిగిందని, బీజేపీ కుట్రలు పన్నడం అలవాటుగా ఉందని, ఈసారి కూడా అందుకు భిన్నంగా లేదని అన్నారు.
ఇక అధికార మార్పిడిపై వస్తున్న ఊహాగానాలను రాష్ట్ర బీజేపీ కూడా తోసిపుచ్చింది. బీజేపీ-జేఎంఎం వ్యతిరేక తీరాలు అని.. ఎప్పటికీ కలవలేవని పేర్కొన్నారు. జేఎంఎం ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే నమ్ముతుందని.. భవిష్యత్‌లో కూడా కలిసి వచ్చే అవకాశం లేదని ప్రతుల్ షాదేవ్ అన్నారు. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ చనిపోయినప్పుడు ప్రధాని మోడీ నివాళులర్పించారు. అనంతరం హేమంత్ సోరెన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
झारखंड झुकेगा नहीं।
— Jharkhand Mukti Morcha (@JmmJharkhand) December 2, 2025