Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్‌స్టీన్’’ ఫైల్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్లు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు అన్ని నిజాలు బయటపడుతాయని ట్రంప్ అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 427 మంది అనుకూలంగా, ఒక్కరు వ్యతిరేకంగా ఓటేశారు.
అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు రూపర్ట్ ముర్డోక్ సహా దాని యజమానులపై దావా వేశారు. ఎప్స్టీన్ పై వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక నివేదిక నకిలీదని కూడా ట్రంప్ అన్నారు. ఈ నివేదికకు కనీసం $10 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ 2003లో జెఫ్రీ ఎప్స్టీన్‌కు పుట్టినరోజు సందేశం పంపారని, అందులో నగ్న మహిళ స్కెచ్, లైంగిక రూపంలో ఉన్న సంతకం ఉందని వార్తాపత్రిక నివేదించింది.…
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు.
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణంలో ప్రముఖుల పేర్లు వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. యుక్త వయసులోని బాలికకు డబ్బు ఎరవేసి సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహించినట్లు జెఫ్రీ ఎప్‌స్టీన్, అతని సహచరుడు మాక్స్ వెల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2002-2005 మధ్య ఎప్‌స్టీన్ ఫ్లోరిడాలోని తన ఇంటికి ఇలా యువతులను ఆహ్వానించి వారిపై లైంగిక దోపిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్‌స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా మూడో బ్యాచ్ అన్‌సీల్డ్ డాక్యుమెంట్లు నిన్న విడుదలయ్యాయి.
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. సెక్స్ కుంభకోణం ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తూ 2019లో ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్, జెట్-సెట్టింగ్ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను యూఎస్‌లోని ఓ కోర్టు బుధవారం విడుదల చేసింది.జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాలలో అమెరికాకు చెందిన చాలా మంది పెద్ద వ్యక్తుల పేర్లు కనిపించాయి.