Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్‌స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా మూడో బ్యాచ్ అన్‌సీల్డ్ డాక్యుమెంట్లు నిన్న విడుదలయ్యాయి.
ఈ కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని భాగస్వామి ఘిస్లైన్ మాక్స్‌వెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2002-2005 మధ్య జరిగిన ఈ సెక్స్ కుంభకోణంలో అనేక మంది యువతులకు డబ్బును ఎరగా వేసి జెఫ్రీ లైంగిక దాడులు చేయడమే కాకుండా, అనేక మంది అమెరికా పెద్దమనుషులకు అమ్మాయిలను సఫ్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితులో ఒకరైన వర్జీనియా గియుఫ్రే 2015లో సివిల్ దావా వేయడంతో ఈ పత్రాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: ChandraBabu Tour: రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూ్ల్ ఇదే..!
కొత్తగా విడుదలైన పత్రాల్లో ఎప్‌స్టీన్ తన సెక్స్ ట్రాఫికింగ్ వ్యాపారాన్ని నిర్వహించడంలో అతనికి అనేక మంది సహకరించినట్లు పేర్కొంది. ఎలా ఎప్‌స్టిన్, మాక్స్ వెల్ యుక్తవయసులోని బాలికలకు ఎలా ఈ అక్రమ రవాణా వ్యాపారంలోకి ఆకర్షించారనే వివరాలను వెలుగులోకి వస్తు్న్నాయి. ఎప్‌స్టీన్ కేసులో బాధితురాలు వర్జీనియా గియుఫ్రే పేర్కొన్న 13 మంది నిర్ధిష్ట సాక్ష్యుల్లో హిల్లరీ క్లింటన్ ఒకరని కొత్తగా వెలుగులోకి వచ్చిన ఫైల్స్ పేర్కొన్నాయి. అయితే మాజీ ఫస్ట్ లేడీ అయిన హిల్లరీ క్లింటన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని కోర్టు ఫైలింగ్ పేర్కొంది.
అంతకు ముందు ఈ పత్రాల్లో ప్రిన్స్ ఆండ్రూ ఎప్‌స్టీన్‌కి చెందిన పామ్ బీచ్ హోమ్ లో ఎక్కువ కాలం గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్‌స్టీన్ సౌత్ ఫ్లోరిడా ఇంటికి వచ్చినట్లు ఫైల్స్ పేర్కొన్నాయి. జులై 2019లో ఎప్స్టీన్‌పై సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు మోపారు, అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.