AAP MP Raghav Chadha: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. “భగత్ సింగ్‌కు భారతరత్న ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అది జరిగితే ఈ దేశంలోని రాబోయే తరాలు ఈ సభను (రాజ్యసభ) కీర్తిస్తాయి.”అని అన్నారాయన.
Read Also: Air Hostess: ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు.. ఆ తరువాత..
బెంగళూరులో తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిశీలించాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోరారు.రాజ్యసభలో జేడీ (ఎస్) నాయకుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీటి కొరత కారణంగా ప్రజలు బెంగళూరులోని ప్రైవేట్ ఆపరేటర్ల నుండి నీటిని కొనుగోలు చేయవలసి వచ్చిందన్నారు. “ఈ సమస్యను పరిష్కరించాలని నేను ముకుళిత హస్తాలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను” అని మాజీ ప్రధాని అన్నారు. నగరంలో నీటి సరఫరా కోసం ప్రైవేట్ ఆపరేటర్లు విపరీతంగా వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేడీ సభ్యుడు సస్మిత్ పాత్ర ఒడిశాకు ప్రత్యేక హోదాను కోరారు.వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రం నష్టపోయిందని, దీని వల్ల రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.