నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 2'లో ఈ వీక్ ఫుల్ గ్లామర్ షోకు ప్రాధాన్యమిచ్చారు. అలనాటి అందాల భామలు జయసుధ, జయప్రదతో పాటు టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీఖన్నా సైతం ఈ షోలో పాల్గొంది.
జయసుధ నటిగా జనం మదిలో మంచి మార్కులు సంపాదించుకోవడానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె నటించిన "జ్యోతి, ప్రేమలేఖలు, ఆమెకథ" చిత్రాలు కారణమని చెప్పక తప్పదు.
(జూన్ 18న ‘ఓ మనిషీ! తిరిగిచూడు!!’కు 45 ఏళ్ళు) దర్శకరత్న దాసరి నారాయణరావు సామాన్యుల పక్షం నిలచి అనేక చిత్రాలను తెరకెక్కించారు. అలా రూపొందించిన ప్రతి సినిమాలోనూ సగటు మనిషి సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాలూ చూపిస్తూ సాగారు. ‘వెట్టిచాకిరి’పై పోరాటం సాగించాలి అని నినదిస్తూ తరువాత ఎన్ని సినిమాలు రూపొందినా, వాటికి ప్రేరణగా నిలచిన చిత్రం దాసరి రూపొందించిన ‘ఓ మనిషీ తిరిగిచూడు!’. 1977 జూన్ 18న ‘ఓ మనిషీ తిరిగిచూడు!’ చిత్రం జనం ముందు…
తెలుగు చలన చిత్రసీమలో పలు అరుదైన రికార్డులు నమోదు చేసిన ఘనత నటరత్న యన్.టి.రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ కే దక్కుతుంది. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తొలిసారి తెరకెక్కించిన చిత్రం ‘అడవిరాముడు’. ఈ చిత్రంలో అనుసరించిన ఫార్ములాను ఇప్పటికీ తెలుగు సినిమా అనుసరిస్తూనే ఉండడం విశేషం! దర్శకత్వంలో రాణించాలనుకొనేవారికి పూర్తిగా అడవిలో రూపొందిన ‘అడవిరాముడు’ చిత్రం ఓ అధ్యయన అంశమనే చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై నలభై ఐదేళ్ళు అవుతున్నా, ఇంకా ‘అడవిరాముడు’ ఫార్ములానే అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు.…
చిత్రపరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్న జయసుధ కొద్దిగా కోలుకున్నారని సంతోషపడేలోపు ఈ మహమ్మారి ఆమెను పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్ లో ఉంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక జయసుధ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి…
ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…