నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2ని స్టార్ట్ చేస్తూ… ‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్’ అంటూ బాలయ్య చెప్పిన మాట సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుని రామారావు గురించి అడిగినా, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినా అది బాలయ్య డేరింగ్ పర్సనాలిటీకి నిదర్శనం. ఇలాంటి ఒక సంఘటనే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎపిసోడ్ 6లో మరొకటి జరిగింది. జయప్రద, జయసుధ, రాశీ ఖన్నాలు గెస్టులుగా వచ్చిన ఈ లేటెస్ట్ ఎపిసోడ్ బయటకి వచ్చింది. ఇందులో బాలయ్య వెటరన్ హీరోయిన్స్ తో సరదాగా మాట్లాడుతూనే ఒక వివాదాస్పద అంశాన్ని టచ్ చేశాడు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు వారికి ‘పద్మ పురస్కారాల్లో’ అన్యాయం జరుగుతుందనే వాదన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ వాదనని నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా మన దగ్గర ఎంతోమంది దిగ్గజాలు ఉన్నా వారికి ‘పద్మ’ని ఇవ్వకుండా ఉట్టి చేతులు చూపిస్తోంది.
Read Also: Unstoppable: బాలయ్య ముందు తన క్రష్ గురించి ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్!
ఈ విషయాన్నే జయసుధని అడిగాడు బాలయ్య… “సహజ నటిగా పేరున్న నీకు ఇప్పటి వరకూ ఒక్క కేంద్ర పురస్కారం కూడా రాలేదు, కారణం ఏంటి?” అని బాలకృష్ణ అడిగాడు. దీనికి సమాధానంగా “కంగనా రనౌత్ పద్మశ్రీ ఇవ్వడాన్ని తాము తప్పుబట్టడంలేదని కానీ సీనియర్లని పక్కనపెట్టి, అంత చిన్న వయసులోనే ఆమెకు పద్మ పురస్కారం ఇవ్వడమేంటని? గిన్నీస్ బుక్ ఎక్కిన వాళ్లని కూడా మర్చిపోతున్నారని” జయసుధ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. జయసుధ ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ… ‘ఎన్నో సినిమాలు చేసినా మమ్మల్ని ఎవరూ ఎందుకు గుర్తించరో అర్ధం కాదంటూ” బాధపడిన సంధర్భాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డ్ రావాలని తాను పార్లమెంట్ లో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశానని, కానీ సాధ్యం కాలేదన్నారు జయప్రద.
Read Also: Unstoppable 2: ‘బాహుబలి’ని ఉక్కిరిబిక్కిరి చేసిన బాలయ్య!