చిత్రపరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్న జయసుధ కొద్దిగా కోలుకున్నారని సంతోషపడేలోపు ఈ మహమ్మారి ఆమెను పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్ లో ఉంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక జయసుధ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె నటించలేకపోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరగా ఆమె కోలుకొని మళ్లీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకొంటున్నారు.