తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’…
అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో…
‘జాతి రత్నాలు’ వంటి మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది నటి ఫరియా.. చిట్టి పాత్రలో ఫరియా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్‌తో ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. మొదటి సినిమా తర్వాత చిట్టి ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలతో బిజీగా వుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అభిమానులకు రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో చిట్టి…
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను…
నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ “జాతిరత్నాలు”. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, నరేష్ సహాయక పాత్రలు పోషించారు. పక్కా మాస్ లాంగ్వేజ్ తో, కామెడీ పంచెస్ తో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. తన చేష్టలతో ఊర్లో పోకిరిగాళ్లు అనే ముద్ర వేయించుకున్న ముగ్గురు…
‘జాతిరత్నాలు’తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రలో మెప్పించింది. చిట్టి పాటతో పాపులర్ అయిన ఈ భామ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేలా లేదు. యూట్యూబ్ స్టార్‌గా వెలిగిన ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని మాయ చేస్తూనే ఉంది. ఇక సైడ్ బిజినెస్ లోను చిట్టి దూకుడు చూపిస్తోంది. ఒక్క సినిమాతోనే విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సీనియర్ యాక్టర్స్ తో సమానంగా షాపింగ్ మాల్…
కన్నడ లేడీ రష్మిక మండన్న కొంతకాలంగా తన స్టైల్, సార్టోరియల్ పిక్స్ తో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వెండి తెరపై ఆమె నటనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ నటి “మిషన్ మజ్ను”తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. దీంతో అభిమానులు ఆమెను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు. Read Also : నోరా ఫతేహి…
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. తొలి సినిమాతోనే (జాతి రత్నాలు) అందరి మనసులు గెలుచుకుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుండగా, రుతుపవనాల రాకతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫరియా తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది. తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’…
అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్ డైరెక్షన్, నటీనటుల ఇన్ క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ తో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల…