నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ “జాతిరత్నాలు”. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, నరేష్ సహాయక పాత్రలు పోషించారు. పక్కా మాస్ లాంగ్వేజ్ తో, కామెడీ పంచెస్ తో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. తన చేష్టలతో ఊర్లో పోకిరిగాళ్లు అనే ముద్ర వేయించుకున్న ముగ్గురు స్నేహితులు మంచి జాబ్ సంపాదించి, బాగా బ్రతకాలని హైదరాబాద్ చేరుకుంటారు.
Read Also : బుల్లితెరపై ఎన్టీఆర్ మ్యాజిక్… షాకింగ్ టిఆర్పీ
ఆ తరువాత జరిగే పరిణామాలు, ట్విస్టులు, హీరోతో హీరోయిన్ ప్రేమాయణం అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. కానీ అనుకోకుండా వారు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నారు? ఈ ముగ్గురు స్నేహితులూ కలిసి తాము ఎలాంటి నేరం చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నారు అనే అంశాన్ని కామెడీ వేలో దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా 11 మార్చి 2021 న విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రంలోకి “చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే” సాంగ్ అందరినీ గిర్రా గిర్రా మెలికలు తిప్పేసింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 10 మిలియన్ల వ్యూస్ సాధించినట్టు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. మొత్తానికి “చిట్టి” లక్ష్మీ పటాస్ పేల్చేసిందిగా !