బుల్లితెరపైనా ‘జాతిరత్నాలు’ హిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను ఆకట్టుకుందో ఆదే స్థాయిలో బుల్లి తెరపై కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు 10.2 టీఆర్పీ రేటింగ్ దక్కినట్లు సమాచారం. నిజానికి ఈ స్థాయి రేటింగ్ పెద్ద సినిమాలకు మాత్రమే దక్కుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే అదే రోజు ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కూడా టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ ప్రసారం అయ్యాయి. ఎన్టీఆర్ షో కంటే కొద్దిగా తక్కువ రేటింగ్ ను ‘జాతిరత్నాలు’ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ సన్నాహాల్లో ఉన్నాడు. ఇక హీరో నవీన్ పొలిశెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దుమ్ము రేపుతున్నాడు.
Also Read
- Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
- Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో 'ధురందర్ 2'ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
- Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. '418'తో భయపెట్టేందుకు సిద్ధం!
- RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్‌కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!