Asia Cup 2023: రాహుల్, బుమ్రా అవుట్.. శ్రీలంకతో తలపడే భారత జట్టు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 against Sri Lanka: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌పై ఘన విజయం సాదించిన భారత్.. 24 గంటలు కూడా గడవక ముందే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం శ్రీలంక, భారత్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు రెడీ అయింది. అయితే భారత జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
ఇటీవల గాయాల నుంచి కోలుకొని వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్.. పాకిస్తాన్‌పై ఆడారు. ఇద్దరు బాగా రాణించారు. రాహుల్ సెంచరీ చేయగా.. బుమ్రా తక్కువ రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీశాడు. అయితే ఈ ఇద్దరికీ శ్రీలంక మ్యాచులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమచాారం. రాహుల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, బుమ్రా బదులుగా మహమ్మద్ షమీ తుది జట్టులోకి వస్తారట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రెండు రోజుల వ్యవధిలో రెండు మ్యాచులు ఆడటంతో ఈ ఇద్దరు అలసిపోయి ఉంటారని మేనేజ్మెంట్ భావిస్తోందట.
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
Also Read: IND vs SL: నేడు భారత్, శ్రీలంక ఢీ.. మ్యాచ్‌పై కన్నేసిన వరుణుడు! రద్దు మంచిదే
ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన అన్ని విభాగాల్లో రాణించింది. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే పరిమితం అయింది.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!