వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచి టీమిండియా ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లలో భారత జట్టు జయకేతనం ఎగుర వేసింది. 2-0తో సిరీస్ ఆసీస్ తో జరిగిన సీరిస్ ను కైవసం చేసుకుంది. ఇక, టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేకుండానే కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోని దిగిన ఇండియన్ టీమ్ ఆసీస్‌కు గట్టి షాకులిచ్చింది. ముఖ్యంగా సెకండ్ వన్డేలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన శ్రేయస్ అయ్యర్ ఏకంగా సూపర్ సెంచరీ చేయడంతో టీమిండియాకు కలిసొచ్చింది.
Read Also: Kapildev: కపిల్ దేవ్ కిడ్నాప్.. అసలు కారణం ఇదే
ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా రెడీ అయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా తదితరులు విశ్రాంతి విరమించి మైదానంలో దిగేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా రేపు (బుధవారం) మ్యాచ్ కోసం ముంబై నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా విమానంలో రోహిత్, బుమ్రాను కలుసుకున్నాడు.
ఇక, రోహిత్, బుమ్రా మధ్యన కూర్చున్న పుజారా ఆ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, చాలాకాలంగా టీమ్ కు దూరమైన పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్నాడు. ససెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న పుజారా.. 8 మ్యాచ్‌లలో అతడు 649 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, జట్టు క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా అతడిపై ఇటీవల సస్పెన్షన్ పడింది. దీంతో ససెక్స్ అధికారులు అప్పీలుకు వెళ్లలేదు.. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన పుజారా ఇంటికి తిరుగుపయనమైయ్యాడు. తన స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విమానంలో వస్తుండగా ఇలా అనుకోకుండా సహచర ఆటగాళ్లైన రోహిత్, బుమ్రాలను కలిశాడు.