Japan Earthquake: జపాన్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 92 మరణించారు. మరో 242 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని అనుకున్న అక్కడి ప్రజలకు కన్నీటిని మిగిల్చింది. దేశంలోని వాయువ్య ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. కేవలం ఒకే రోజులో 150కి పైగా భూకంపాలు జపాన్ దేశాన్ని తాకాయి.
Tokyo-Haneda airport: జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తర్వాత 400 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా తరలించారు.
జపాన్ శాస్త్రవేత్తలు విప్లమాత్మక ప్రయోగాన్ని ఆవిష్కరించారు. ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగించి విజయం సాధించారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయో మీథేన్‌తో జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ ఆవు పేడతో తయారు చేసిన ఇంధనంతో రాకెట్ భూమి నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి, సురక్షితంగా భూమిపైకి దిగింది. హెకైడో స్పేస్ పోర్టు లాంచ్ కాంప్లెక్స్ ఈ పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్…
Cockroach: బొద్దింకలు ఇంట్లో చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని పారదోలేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. స్ప్రేలు, ఇతర రసాయనాలను వాడుతుంటారు. కానీ జపాన్‌లో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నిస్తూ తన సొంత అపార్ట్‌మెంట్‌ని తగలబెట్టుకున్నాడు.
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి లగ్జరీ కార్లు అంటే విపరీతమైన మోజు. అయితే ఆ దేశ అణు కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తర కొరియాపైన ప్రపంచంలో చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశానికి లగ్జరీ వస్తువులు చేరాలంటే అక్రమ రవాణానే మార్గం. దేశంలో ప్రజలు తినడానికి తిండి లేనప్పటికీ.. కిమ్‌కి మాత్రం ఫారెన్ మందు, స్విట్జర్లాండ్ చీజ్ మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. వీటిలో పాటు విలువైన కార్లను స్మగ్లింగ్…
జపాన్‌లోని హక్కైడో ప్రావిన్స్‌లోని హకోడేట్ తీరంలో శుక్రవారం ఉదయం వేల సంఖ్యలో చేపలు కొట్టుకురావడం కనిపించింది. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలను చూసి స్థానిక ప్రజలు ఖంగుతిన్నారు. కాగా.. ఆ చేపలను తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. చనిపోయిన చేపలను ఇంటికి తీసుకురావద్దని స్థానిక యంత్రాంగం ప్రజలను అభ్యర్థించింది. ఎందుకంటే ఈ చేపలు విషం వల్ల చనిపోయాయని చెబుతున్నారు. కాగా.. చనిపోయిన ఈ చేపల వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో…
మాములుగా మనం రెస్టారెంట్ కు ఎందుకు వెళ్తాం… ఫుడ్ తినడానికి.. కానీ చెంప దెబ్బలు తినడానికి వెళ్తారా? చచ్చినా వెళ్లరు..అయితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్ మాత్రం భోజనంతో పాటు రెండు చెంపలు వాయించే సేవలను అందిస్తోంది.. ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. రెస్టారెంట్లో చెంపలు వాయించడం ఏంటి.? డబ్బులు చెల్లించి మరీ కొట్టించుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా. పూర్తి వివరాలు తెలియాలంటే కాస్త ముందుకు వెళ్ళాల్సిందే.. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని నగోయా…