తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ భార్య అయేషా అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
Jani Master Case Updates: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. మాస్టర్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల…
Hyderabad Police Release a Statement on Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అని బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ…
గత కొద్దిరోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోన్న విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేడు ఉదయం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం అతడిని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ అరెస్టైన వేళ సినీ నటుడు నాగబాబు చేసిన…